కేసీఆర్‌ను కలిసిన వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య

-

తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 17 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 9 మందిని మాత్రమే ప్రకటించింది. బీజేపీ కూడా దాదాపు అభ్యర్థులను ప్రకటించింది. అన్ని పార్టీలు ప్రచారాన్ని షురూ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

లోక్ సభ ఎన్నికల్లో తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆమె అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. పన్నెండు రోజుల క్రితం వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. దీంతో ఆమె జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె ఈరోజు కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ గెలిచారు. ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news