హాయిగా నిద్రపోవడానికి ఆయుర్వేదం అందిస్తున్న టిప్స్..

-

మన శరీరానికి నిద్ర చాలా అవసరం. శరీరం పునరుత్తేజం పొంది మరలా కొత్త రోజులోకి కొత్తగా ప్రవేశించడానికి నిద్ర చాలా మేలు చేస్తుంది. ఐతే నిద్ర తొందరగా రాని వాళ్ళు, రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, రాత్రిపూట పనిచేయడాలు మొదలగునవి నిద్రని దూరం చేసే కారణాలు.

ఐతే నిద్రలేమి వల్ల అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అధిక ఒత్తిడి, బీపీ, డయాబెటిస్, హార్ట్ అటాక్, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు నిద్రలేమి వల్ల కలుగుతాయి. ఐతే వీటి నుండి దూరం కావడానికి సరిగ్గా నిద్రపొతే చాలు. చాలామంది చెబుతుంటారు. ఎక్కువ సేపు నిద్రపోకపోయినా పెద్ద ఇబ్బందేమీ ఉండదని. కానీ అధ్యయనం ప్రకారం శరీరానికి 8గంటల నిద్ర చాలా అవసరం.

ఐతే నిద్రపోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం.

రాత్రి పడుకునే ముందు స్నానం చేసి బెడ్ మీదకి చేరుకోవాలి. స్నానం వల్ల శరీరం రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల తొందరగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది.

పడుకునే ముందు ధ్యానం చేసినా నిద్ర బాగా పడుతుంది. ధ్యానం వల్ల ఒకే విషయం మీద దృష్టి మళ్ళుతుంది. అప్పుడు మెదడుకి ఆలోచించడానికి ఎక్కువ శ్రమ పట్టదు. అందువల్ల తొందరగా నిద్రలోకి ఉపక్రమించవచ్చు.

ఒక గ్లాసెడు గేదె పాలు తాగడం వల్ల తొందరగా నిద్రలోకి జారుకుంటారు.

రాత్రిపూట అధికభోజనం చేయవద్దు. మాంసం, చేపలు వంటి తొందరగా అరగని పదార్థాలని ఆహారంగా తీసుకోకూడదు. అవి నిద్రని దూరం చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version