తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చినట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు. 69, 842 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోగా… 28, 234 మంది మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నడకదారిన వచ్చేభక్తులకు 8 గంటలకు పైనే సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నడక దారిన వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. తిరుమలలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో తిరుమలలో భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారి దర్శనానికి రావాలని అధికారులు కోరుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉన్నట్లయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.