తిరుపతి లోక్ సభ పరిధిలో వైసీపీ క్లీన్ స్వీప్

-

తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. త్వ‌ర‌లో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతుండ‌డంతో ఇక్క‌డ మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ? ఎవరిక్ అనుకూలంగా వ‌స్తాయనే ఆస‌క్తి నెలకొని ఉంది. అయితే ఇక్క‌డ ఎవరూ ఊహించాని రీతిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇక్కడ సత్తా చాటుతామని భావింఛి ఎంపీ సీటు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటున్న జ‌న‌సేన – బీజేపీల ప‌రువు పోయినట్టు అయింది.

తిరుపతి కార్పొరేషన్ విషయానికి వస్తే 50 డివిజన్ లు ఉండగా వైసీపీ -48, టిడిపి -1 స్థానాలు సాధించాయి, జనసేన బీజేపీలు ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయాయి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ లో మొత్తం 25 వార్డులు ఉండగా వైసీపీ 24 సాధించింది, టీడీపీ 01 స్థానానికి పరిమితం అయింది. ఇక బీజేపీ -జనసేనలు ఖాతా తెరవలేకపోయాయి. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకి వైసీపీ 25 క్లీన్ స్వీప్ చేసింది. నాయుడుపేట మున్సిపాలిటీ -25 వార్డులకు గాను వైసీపీ 23 వార్డులు, టిడిపి 01, బిజెపి 01 స్థానంతో సరిపెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news