తెలంగాణ జేఏసీ సమావేశం రసాభాస

-

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో గందరగోళం నెలకొంది. హైదరబాద్లోని తాజ్ డెక్కన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై చర్చ జరుగుతోంది. దీనిపై తెలంగాణ ఐకాస ఛైర్మన్ రఘు అన్ని విషయాలను వివరిస్తుండగా నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఉద్యోగి శ్యాంప్రసాద్ అడ్డుకున్నారు. దీంతో కాస్త గందరగోళం ఏర్పడింది. ఆతర్వాత కొద్ది సేపటికి వివిధ పార్టీల నేతలు కలుగజేసుకుని తిరిగి చర్చను ప్రారంభించారు. నీటి లభ్యత, రీడిజైనింగ్ ఇతర అంశాలను చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు జీవన్ రెడ్డి, దాసోజు శ్రావణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, , సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, నీటి పారుదల నిపుణులు, మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news