గుడ్లు ఉడికేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. అందుకని చాలా మంది పిల్లలు మొదలు పెద్దల వరకు గుడ్లను తింటూ ఉంటారు. అయితే గుడ్లను ఉడికించేటప్పుడు గుడ్లు పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు ఉడికించేటప్పుడు అవి పగలకుండా ఉండాలంటే కొంచెం నూనె వేయండి. దీంతో గుడ్డు పగిలిపోకుండా ఉంటాయి. అలానే ఉల్లిపాయల్ని బంగాళదుంపల్ని ఒకే చోట స్టోర్ చేయకండి. ఈ రెండిటిని ఒకే దగ్గర పెట్టడం వలన వాయువుని విడుదల చేస్తాయి. దీంతో త్వరగా పాడవుతాయి. విడివిడిగా స్టోర్ చేయండి.

 

అలానే నిమ్మకాయలో రసం బాగా రావాలంటే 20 సెకండ్ల పాటు ఓవెన్ లో పెట్టండి అప్పుడు దానిని తీసి మృదువుగా చేసి అందులో మొత్తం రసాన్ని పిండండి. ఇలా చేయడం వలన నిమ్మ లో రసం ఈజీగా వచ్చేస్తుంది. వర్షా కాలం లో మసాలా పదార్థాలు తేమ వస్తుంటాయి. ఇలా అవ్వకూడదు అంటే మసాల సామాన్ల ని కొంచెం ఉప్పు వేయండి. అప్పుడు మసాలాలు తడిసిపోకుండా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి. పాడైపోవు.

ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ని మీరు పాటిస్తే ఖచ్చితంగా ఆహార పదార్థాలు పాడవ్వవు. పైగా ఆహార పదార్థాలను వృధా చేసుకోకుండా మీరు వాటిని బాగా వాడుకోవడానికి అవుతుంది చాలామంది ఈ చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా భావించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా సులభమైన ఈ చిట్కాలని పాటిస్తే వాటిని పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news