వారణాసి కోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే.. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు బ్రేక్

-

ఉత్తర్​ప్రదేశ్​లో జ్ఞానవాపి మసీదులో ఇవాళ ఉదయం ప్రారంభమైన శాస్త్రీయ సర్వేకు బ్రేక్ పడింది. సర్వేను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ సర్వేపై వారణాసి కోర్టు ఆదేశాలను జులై 26 సాయంత్రం 5 గంటల వరకు అమలు చేయరాదని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు గతవారం కీలక ఆదేశాలు వెలువరించిన విషయం తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు అధికారుల బృందం సోమవారం సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. వారణాసి కోర్టు ఆదేశాలపై స్టే విధించాలని మసీదు కమిటీ .. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇవాళ అత్యవసర విచారణ చేపట్టింది.

‘ఒక్క ఇటుక కూడా తొలగించట్లేదు’ విచారణ సమయంలో సీజేఐ ధర్మాసనం.. సర్వే చేస్తున్నప్పుడు మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. “ఒక్క ఇటుకనూ తొలగించట్లేదు. అలాంటి ప్రణాళిక కూడా లేదు. ప్రస్తుతానికి అక్కడ కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్‌ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదు” అని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news