భారీగా పెరిగిపోయిన బంగారం.. పడిపోయిన వెండి..!

-

పసిడి ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంతో ఒక వైపు వినియోగం పడిపోయినా.. ధరలకు మాత్రం ఎక్కడా బ్రేక్ లేదు. శ్రావణమాసం పెళ్లిళ్లకు సీజన్. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.640 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,940కి చేరింది.

- Advertisement -
gold
 

అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.590 పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.50,370కి పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2700 పతనమైంది. దీంతో ధర రూ.62,000కు దిగొచ్చింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పైకి కదిలింది. రూ.51,250కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.450 పెరుగుదలతో రూ.52,450కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.1300 పెరుగుదలతో రూ.66,000కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...