గత వారం రోజులుగా రోజు పెరుగుతున్న బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగార౦ పెరిగినా సరే మన దేశంలో తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 తగ్గింది. దీనితో రూ.43,950కు దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.
రూ.490 తగ్గడంతో 10 గ్రాములకు రూ.46,700కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరిగింది. ఔన్స్‌కు 1695.60 డాలర్లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఇక్కడ నిన్న కూడా బంగారం ధరలు తగ్గాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.590 తగ్గింది. దీనితో రూ.44,750కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తగ్గుతూ వచ్చింది. రూ.520 తగ్గింది. దీనితో రూ.46,500కు చేరుకుంది. కేజీ వెండి ధర పెరిగింది. రూ.1010 పెరిగింది. దీంతో ధర రూ.42,520కు చేరింది.