గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గడ౦ మొదలుపెట్టాయి. రోజు ఎంతో కొంత పెరిగిన బంగారం ధరలు నిన్నటి నుంచి తగ్గడం మొదలుపెట్టాయి. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధరలు తగ్గాయి బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 540 రూపాయలు తగ్గాయి. దీనితో పది గ్రాముల బంగారం ధర 43,410 రూపాయలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే పది గ్రాములకు 500 రూపాయలు తగ్గింది. దీనితో 46,200 రూపాయలకు చేరుకుంది బంగారం. విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇదే విధంగా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లు పది గ్రాములకు 540 రూపాయల వరకు తగ్గింది. దీనితో 43,410 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయల వరకు తగ్గడం తో 46,200 రూపాయలుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయల పెరుగడ౦తో 47,000 రూపాయలగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 500 రూపాయల పెరగడం తో 45,250 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర 41 వేల మార్కు కు దిగి వచ్చింది. కేజీ వెండి ధర 41,000 రూపాయలు గా ఉంది.