ఈ ఏడాదే ఐపిఎల్…!

-

భారత్ లో ఎక్కువ ప్రజాదరణ పొందిన క్రికెట్ టోర్నీ ఐపిఎల్. దీని కోసం క్రికెట్ అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తూ ఉంటారో అందరికి తెలిసిందే. ఈ టోర్నీ కోసం పనులు మానుకుని మ్యాచ్ లు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఐపిఎల్ ని నిర్వహించలేదు బోర్డు. దీనితో ఇది ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ టోర్నీ జరిగే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ దీన్ని మర్చిపోవచ్చు అని కూడా చెప్పింది. అయినా సరే కరోనా తగ్గితే నిర్వహించే అవకాశం ఉందని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వినోద కార్యక్రమం కాబట్టి మ్యాచ్ లు నిర్వహించినా సరే ప్రేక్షకులు ఉండే అవకాశం లేదనే చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపిఎల్ జరిగే అవకాశం ఉందని ఒక సర్వే చెప్పింది.

ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగుతుందని అభిమానులలో ఆశ మాత్రం చావలేదు. మైటీమ్‌11 అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 60 శాతం మంది ఐపీఎల్‌ జరుగుతుందని ఆశగా చెప్పడం గమనార్హం. 10 వేల మందితో ఈ సర్వే నిర్వహించారు. మిగిలిన 40 శాతం మంది మాత్రం ఈ ఏడాది రద్దయినట్టేనని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌కు ఢోకా లేదని చెప్పిన వారిలో 13 శాతం మంది ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news