నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ..!

-

ఈ రోజు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అఖిల భారత వైద్య సంఘం పిలుపునిచ్చింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నీట్ పీజీ కౌన్సిలింగ్ ను వెంటనే నిర్వహించాలంటూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెసిడెంట్ వైద్యులు నిన్న ఢిల్లీలోని మౌలాన ఆజాద్ మెడికల్ హాస్పిటల్ నుండి సుప్రీం కోర్టు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిరసనను పోలీసులు అడ్డుకుని రెసిడెంట్ వైద్యులపై లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

తమపై లాఠీఛార్జ్ చేయడాన్ని అఖిలభారత వైద్య సంఘం తీవ్రంగా పరిగణించింది. దాంతో నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఉదయం 8 గంటల నుండి విధులకు దూరంగా ఉండాలంటూ వెల్లడించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఫెడరేషన్ ఆఫ్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది. మంగళవారం బ్లాక్ డే అంటూ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news