నేడు అక్క‌డ విద్యాసంస్థ‌ల‌కు సెలవు

-

అల్ప పీడ ద్రోణి వ‌ల్ల ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు త‌మిళ నాడు రాష్ట్రాల‌లో వర్షం బీభ‌త్సం సృష్టిస్తుంది. గ‌త కొద్ది రోజులు గా ఎడ తెరపి లేకుండా వ‌ర్షం కురుస్తుంది. ఈ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉడంటం తో చిత్తూర్, నెల్లూర్ జిల్లాలో అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తు అక్క‌డి క‌లెక్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు.

గురు వారం కూడా ఈ జిల్లాల‌లో అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెలవు లు ప్ర‌క‌టించారు. వ‌ర్షాల వ‌ల్లే ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఆదేశించారు. ఇప్ప‌టికే ఈ జిల్లాల‌లో ని ప‌లు గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫరా, ర‌వాణా సౌక‌ర్యం నిలిచి పోయాయి. అయితే వ‌ర్షం ఈ రోజు కూడా తగ్గు ముఖం ప‌ట్టే అవ‌కాశం లేదు. అలాగే ప‌లు గ్రామాల్లో వ‌ర్ష‌పు నీళ్లు ఇళ్ల లో కి వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news