ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో నేడే తొలి ద‌శ ఎన్నిక‌లు

-

మినీ భార‌త్ గా పిలిచే.. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లి ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. నేడు తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో విజ‌యం సాధింస్తే.. దేశ రాజ‌కీయాల‌నే శాసించే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన పార్టీ లేదా కుట‌మీ.. కేంద్రంలో అధికారాన్ని ద‌క్కించుకుంటుంది. దీంతో బీజేపీ ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎలాగైనా రెండో సారి ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తుంది.

అలాగే యూపీ లో మ‌రో ప్ర‌ధాన పార్టీ ఎస్పీ కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా చాలా రోజుల తొలి సారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. కాగ నేడు జ‌రిగే తొలి విడుద‌ల పోలింగ్ లో ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని 11 జిల్లాల్లోని 58 నియోజ‌క వ‌ర్గాల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ 58 నియోజ‌క వ‌ర్గాల్లో 623 మంది అభ్య‌ర్థులు త‌మ అదృష్టాన్ని చూసుకోనున్నారు. అలాగే ఈ తొలి దశ పోలింగ్ లో దాదాపు 2.27 కోట్ల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news