దొంగ మందులు… రంగంలోకి దిగిన జగన్

ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే ప్రజల వద్ద నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు అదే పనిగా వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి కరోనా టెస్ట్ ల వరకు దోపిడి తీవ్ర స్థాయిలో ఉంది. 3 వేల ఇంజక్షన్ ని 40 వేలకు విక్రయిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చాలా ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు తీసుకుని, అవసరమైన రోగులకు ఇవ్వడంలేదు అని ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.

ఈ విషయంలో నేరుగా సిఎం జగన్ జోక్యం చేసుకున్నారు. పైగా వాళ్లనే కొనుక్కుని తీసుకురండి అని చెప్తున్నాయి అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మండిపడింది. దీనిపైన విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశం ఇచ్చారు. జిల్లాల వారీగా ఏయే ఆసుపత్రుల్లో ఎంతెంత రెమ్ డెసివిర్ స్టాక్ ఉందో చెప్పాలి అని, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై ప్రజలకి అవగాహన కల్పించాలి అని సూచించారు.