దేశంలో కరోనా థర్డ్ వేవ్ విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో… చాలా రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తమిళనాడు సర్కార్ ప్రతి ఆదివారం లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకుంది. స్టాలిన్ సర్కార్ నిర్ణయం మేరకు గత ఆదివారం నుంచే ఈ లాక్ డౌన్ నిబంధన అమలులోకి రానుంది.
తమిళ నాడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు అంతటా నైట్ కర్ఫ్యూ విధించింది సర్కార్. దీంతో అన్ని రోజులలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక ఇవాళ ఆదివారం కావడంతో… తమిళనాడులో మళ్లీ లాక్ డౌన్ అమలులోకి రానుంది. ఇక ఇవాళ కేవలం అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రం స్టాలిన్ సర్కార్ అనుమతులు ఇచ్చింది. లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో.. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.