ఆలస్యం చేస్తున్న రేవంత్.. హుజురాబాద్ పై తగ్గిన దూకుడు..!

-

హుజురాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టు, గొర్రెల పంపిణీ, ఈటల అనునచరులకు పదవులు, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తంగా హుజురా‘బాద్ షా’ టీఆర్ఎస్సే కావాలని భావిస్తోంది. అయితే, గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ సైతం బరిలో బలంగానే ఉన్నారు. అస్వస్థతకు గురయ్యేంత వరకు 22 రోజుల పాటు ‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట పాద యాత్ర చేశారు. ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తల మద్దతు కూడా ఉంది. అయితే, నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అనేది చర్చానీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఆల్రెడీ గులాబీ గూటికి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీలో ఉన్న స్వర్గం రవి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. మంత్రుల పర్యటనలు, మండలానికో ఇన్‌చార్జి నియామకం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు అధికార పింక్ పార్టీ సర్వశక్తులను, యంత్రాంగాన్ని వాడుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తోంది. అలా టీఆర్ఎస్ పార్టీ బరిలో దూసుకుపోతున్నది. ఇక ఈటల రాజేందర్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఇంకా జోరుగా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ తన గత జ్ఞాపకాలను, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అలా బీజేపీ తరఫున ఈటల కూడా బరిలో దూసుకుపోతూనే ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం కదలికలేని స్థితిలోనే ఉండిపోయింది. హుజురాబాద్ ఉప పోరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిల నియామకం జరిగింది. కానీ, బరిలో ఉండబోయే అభ్యర్థి ఎవరు? ఏ అంశంపై ప్రచారం చేయనున్నారు? అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో అనేది తేలాల్సి ఉంది. హుజురాబాద్ ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు? తేలాల్సి ఉంది. రేవంత్ వ్యూహం ఏంటి? అనేది కూడా తెలియడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news