చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఊగిపోతున్నాడు. ఇటీవల తన కొడుకు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు తన కొడుకు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.తన కొడుకు అద్భుతంగా డాన్స్ చేసిన పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఆర్ఆర్ఆర్ సినిమాలో తన కొడుకు నటించిన పాత్ర గురించి హాలీవుడ్ మేకర్లు మాట్లాడడం.. ఆస్కార్ వేదిక మీద అంతర్జాతీయ మీడియాలో కూడా తన కొడుకు పేరు వినిపిస్తుంటే ఏ తండ్రికి మాత్రం ఆనందం, గర్వకారణంగా ఉండదు.
అయితే ఇప్పుడు చిరంజీవి కూడా అదే మూడ్ లో ఉన్నాడు. రామ్ చరణ్ ని చూసి ఎంతో గర్విస్తున్నాడు. అందుకే ఈసారి బర్తడే వేడుకలను చిరంజీవి ప్రత్యేకంగా తన ఇంట్లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దవాళ్ళను కూడా ఆహ్వానించినట్లుగా కనిపిస్తోంది. కన్నడ నుంచి స్టార్ మేకర్లు కూడా వచ్చారు . ప్రశాంత్ నీల్, నార్తన్ లని కూడా ఈ బర్తడే వేడుకల్లో మెరిసారు. వీరితో త్వరలో రామ్ చరణ్ సినిమాలు తీయబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు వచ్చాయి. ఇక నందమూరి ఫ్యామిలీ మాత్రం ఎప్పటిలాగే దూరంగా ఉండిపోయింది
కనీసం ఎన్టీఆర్ వస్తాడని అనుకున్నారు>> ఆయన కూడా రాలేదు. ఎక్కడ ఫోటోలు, వీడియోలు కూడా కనిపించలేదు. మామూలుగా అయితే రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీ అయినా వచ్చేది.. కానీ ఈ వేడుకలకు ఎన్టీఆర్ కూడా దూరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బాలయ్య అయితే మెగా ఇంట్లో అడుగు పెట్టడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మెగా, నందమూరి ఫ్యామిలీ మధ్య మాటర్ చర్చలకు వస్తోంది. మరో వైపు అల్లు ఫ్యామిలీ కూడా నందమూరి బాలకృష్ణ ను ఓన్ చేసుకుంటుంది. ఈ కారణంగానే మెగా, అల్లు కాంపౌండ్ల మధ్య కూడా దూరం పెరుగుతోంది.