పీఎఫ్ ఖాతా లో నామినీని ఎంపిక చేశారా..? పూర్తి ప్రాసెస్ వివరాలు ఇవే..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఖాతాదారులు నామినీలను చేయడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యుల సౌలభ్యం కోసం నామినీలను జోడించే ప్రక్రియను ఈజీ చేయడానికి ఇ-ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టింది. EPFOలో PF ఖాతాదారులకు నామినీని ఎంచుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యము.

అలాంటి సమయం లో నామినీ పేరు మీ EPF ఖాతాలో నమోదు చేయకపోతే అన్ని సౌకర్యాలను ఉపయోగించలేరు. అధికారిక వెబ్‌సైట్‌లో ఖాతాదారులు నామినీ పేరు తో ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యచ్చు. ఈ ప్రక్రియ ని దశలవారీగా మీకు తెలియజేస్తున్నాము. ఇక మీ ఖాతాలో నామినీని ఎలా ఎంచుకోవాలి అనే విషయం చూసేద్దాం.

దీని కోసం మొదట మీరు UAN EPFO వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత మీరు మెను నుండి ‘మేనేజ్’ ని ‘ఇ-నామినేషన్’ ని ఎంచుకోండి.
ఆ తరవాత కుటుంబ డిక్లరేషన్‌ లో ‘అవును’ అని ఎంచుకోండి.
ఇప్పుడు మీరు ‘గృహ వివరాలను జోడించు’ విభాగాన్ని పూర్తి చేయండి.
ఇప్పుడు మీ డీటెయిల్స్ ని ఇవ్వండి.
కుటుంబ వివరాలను జోడించు పై క్లిక్ చేయండి.
ఒకటి కంటే ఎక్కువ నామినీలను యాడ్ చెయ్యచ్చు.
OTPని రూపొందించడానికి ‘e-sign’పై క్లిక్ చేయండి.
ఆధార్‌తో లింక్ చేసిన నంబర్‌కు OTP వస్తుంది. ఎంటర్ చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news