ఓమిక్రాన్ వేరియంట్ తో ప్రపంచ దేశాలు గజగజ… ఆంక్షలు విధింస్తున్న పలు దేశాలు

-

కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్ ‘బి.1.1.529’ ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. తాజాగా ఈ ‘బి.1.1.529’ వేరియంట్ కు ఓమిక్రాన్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. కొత్తగా వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ లో అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూసిన వేరియంట్ల కంటే బి.1.1.529’ అత్యంత ప్రమాదకరమైనదని సీనియర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని, డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇవి రెట్టింపు అని వారు విశ్లేషించారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్‌, జింబాబ్వే, నమీబియా తోపాటు హాంకాంగ్ లో ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్, బెల్జియం దేశాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు బయటపడటంతో మిగతా ప్రపంచ దేశాాలు అలెర్ట్ అవుతున్నాయి.

corona

మరోవైపు కొత్త వేరియంట్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి రాకపోకల్ని నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌, సౌదీ దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మిగతా దేశాలు కూడా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్‌, జింబాబ్వే, నమీబియా తోపాటు హాంకాంగ్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా ఈ దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news