టాలీవుడ్ డైరెక్టర్స్ తెలివి మీరిపోయారు. మెస్మరైజ్ చేసే లైన్ లు చెబుతూ హీరోల కాల్షీట్స్ ఈజీగా కొట్టేస్తున్నారు.టాలీవుడ్లో ఓ ఇద్దరు దర్శకులు ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నారు.ఆఫర్లను అలా ఒడిసి పడుతున్నారు.సెట్ లో టాలెంట్ చూపి హిట్లు కొడుతున్నారు.అంతలా ఇంటిలెక్చువల్ స్కెచ్ లేస్తున్న ఇద్దరు డైరక్టర్ల పై టాలీవుడ్ ఆసక్తికర చర్చ జరుగుతుంది….
టాప్ హీరోల కాల్షీట్స్ పట్టుకోవడం అంత ఈజీ కాదు.ఆ మాటకొస్తే తమ కథలతో కన్విన్స్ చేయడం అస్సలు జరిగే పనే కాదు.అందుకే కథకు ఎంతో ఇంపాక్ట్ గా చెప్పుకునే కొన్ని సీన్స్ ను హీరోలకు అర్ధమయ్యేలా చెప్పి ఛాన్స్ లు కొడుతున్నారని కొందరి దర్శకుల విషయంలో కామెంట్స్ పడుతున్నాయి.
సుప్రీమ్`లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లని మెప్పిస్తూ ఓ ఫైట్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఆ ఫైట్ ఆ సినిమాలో హైలెట్ అయ్యింది. దివ్యాంగుల మనసులతో పాటు.. అందరి హృదయాల్నీ గెలుచుకుంది. ఆతర్వాత ఎఫ్ 2లో మన చుట్టు పక్కల ఫ్యామిలీ లో రెగ్యులర్ గా జరిగే కొన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పి ఇదే అనీల్ రావిపూడి ఎఫ్ 2తో హిట్ కొట్టాడు.తాజాగా క్యాష్ సెగ్మెంట్ ను స్టోరీగా తీసుకుని ఎఫ్ 3 చేస్తున్నాడు.ఈ సినిమా పట్టాలెక్కడానికి క్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఎలా ఉంటారు అనే థీమ్ ను హైలెట్ చేస్తున్నాడు.ఇదే థీమ్ దిల్ రాజుతో పాటు హీరోలిద్దరికీ నచ్చడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లింది.
అనీల్ రావిపూడి తరహాలోనే `సర్కారు వారి పాట`లోనూ అలాంటి సీన్ ఒకటి ఉండేలా ప్లాన్ చేశాడు పరశురామ్ . దివ్యాంగుల నేపథ్యంలో ఓ ఫైట్ ఈ సినిమాకి హైలెట్ అవుతుందట. ఓ దివ్యాంగుడి కోసం కథానాయకుడు చేసే పోరాటం.. `నెవర్ బిఫోర్`లా ఉండబోతోందని యూనిట్ చెబుతుంది.ఈ సినిమా స్టోరీ మహేష్ కు చెబుతున్నప్పుడు ఈ సీన్ రాగానే ప్రిన్స్ థ్రిల్ అయిన్లు తెలుస్తుంది.అక్కడే ప్రిన్స్ పరశురామ్ డైరెక్షన్లో చేయడానికి ఓకే చెప్పాడట.సరిలేరు నీకెవ్వరులోను రమణ లోడ్ ఎత్తాలి సీన్ కు ఇలాంటి ఆదరణ దక్కింది.వాటి ఇంపాక్ట్ తర్వాత సినిమాలపై పడుతున్నాయి.