తెలుగువాళ్లు బాలీవుడ్‌కి వెళ్లడం పెద్ద విషయంలా చూస్తుంటారు. ఇక్కడ భారీ బ్లాక్‌బస్టర్స్ ఉన్నోళ్లకే హిందీలో ఆఫర్స్ వస్తుంటాయని అంతా అనుకుంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం తెలుగులో పెద్దగా హిట్స్‌లేకపోయినా ముంబాయి వెళ్తున్నారు. నార్త్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చెయ్యడానికి స్కెచ్చులేస్తున్నారు.
సుజిత్ ‘లూసిఫర్’ రీమేక్ నుంచి బయటకొచ్చాక మరో తెలుగు సినిమా చెయ్యలేదు. యువి క్రియేషన్స్‌లో ఒక సినిమా డైరెక్ట్ చేస్తాడనే టాక్ వచ్చినా, హీరో మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ప్రభాస్‌తో లార్జ్ స్కేల్‌లో తీసిన ‘సాహో’కి మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో, సుజిత్‌ని చాలామంది హీరోలు లైట్ తీసుకుంటున్నారట. దీంతో తెలుగు స్టార్స్‌తో పెట్టుకుంటే పనవ్వట్లేదని ముంబాయి ఫ్లైట్ ఎక్కేశాడు. ‘యురి’తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విక్కీ కౌశల్‌తో సుజిత్ ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ‘సాహో’కి తెలుగులో మిక్స్‌డ్ రిజల్ట్ వచ్చినా, హిందీలో భారీ వసూల్లు వచ్చాయి. సుజిత్ డైరెక్షన్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సుజిత్‌తో సినిమా చెయ్యడానికి విక్కీ కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వస్తోంది.
సుజిత్ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌లోకి వచ్చిన వినాయక్ కూడా ముంబాయి వెళ్తున్నాడు. ‘లూసిఫర్’ స్క్రిప్ట్ మొదలుపెట్టి, ఆ తర్వాత బయటకు వచ్చిన వినాయక్ ఇప్పుడు ‘ఛత్రపతి’ని హిందీలో తీస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘ఛత్రపతి’ని రీమేక్ చేస్తున్నాడు వినాయక్. చాలామంది డైరెక్టర్లు రీమేక్ సినిమాలతో బాలీవుడ్‌కి వెళ్తున్నారు. తెలుగులో తీసిన హిట్‌మూవీస్‌ని హిందీకి తీసుకెళ్తున్నారు. అయితే కొంతమంది దర్శకులు ఇక్కడ అప్ అండ్ డౌన్స్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌కి వెళ్తే, అక్కడా నెగటివ్ రిజల్ట్ వచ్చింది. కెరీర్‌ని మరింత ప్రాబ్లమ్స్‌లో పడేసింది.
అనుష్కతో హర్రర్ మూవీ ‘భాగమతి’ తీసిన అశోక్, ఈ రీమేక్‌తోనే బాలీవుడ్‌కి వెళ్లాడు. అక్షయ్ కుమార్ నిర్మాణంలో ‘భాగమతి’ని ‘దుర్గామతి’గా రీమేక్ చేశాడు. భూమి పడ్నేకర్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసింది. అయితే తెలుగులో తీసిన కథని సేమ్ ఫ్లేవర్‌తో తెరకెక్కించినా హిందీ జనాలకి పెద్దగా నచ్చలేదు. అశోక్ హారర్ స్టోరీని రిజక్ట్ చేశారు. శర్వానంద్ కెరీర్‌లో మెమరబుల్ మూవీ.. సాయి కుమార్ పెర్ఫామెన్స్‌ని మరో స్టేజ్‌కి తీసుకెళ్లిన సినిమా ‘ప్రస్థానం’. దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగునాట యూనిక్ స్టోరీగా నిలిచింది. ఇక ఈ సినిమాని హిందీలో సంజయ్‌దత్‌తో రీమేక్ చేశాడు దేవకట్టా. కానీ బాలీవుడ్‌ని ఈ ‘ప్రస్థానం’ పెద్దగా ఆకట్టుకోలేదు.
దేవకట్టా, అశోక్ ఇద్దరూ తెలుగులో కొంచెం స్లో ఫేజ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌కి వెళ్లారు. అక్కడా పెద్దగా మెప్పించలేకపోయారు. ఇప్పుడు సుజిత్ కూడా ఇలాంటి స్టేజ్‌లోనే ముంబాయి వెళ్తున్నాడు. అలాగే ‘ఇంటిలిజెంట్’ ఫ్లాప్‌తో స్లంపులో పడిన వినాయక్ కూడా బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు. మరి వీళ్లు ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటారో చూడాలి.