బీహార్‌కు చెందిన ఆ స్వీట్ కేజీ ధ‌ర రూ.7500 ప‌లుకుతోంది.. ఇంత‌కీ ఏమిటది ?

-

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల స్వీట్లలో కాజా కూడా ఒక‌టి. ఏపీలో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా త‌యారు చేయ‌బ‌డిన కాజాలు మ‌న‌కు అనేక స్వీట్ షాపుల్లో ల‌భిస్తాయి. అయితే కేవ‌లం ఏపీ మాత్ర‌మే కాదు.. బీహార్‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌లోనూ కాజాల‌ను త‌యారు చేస్తారు. కాక‌పోతే రుచి వేరేగా ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం అమెరికాలో ఈ స్వీట్‌కు బాగా డిమాండ్ పెరిగింది.

this sweet from bihar getting price of rs 7500 in usa

అమెరికా నుంచి చాలా మంది కాజాలను ఆర్డ‌ర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజీ కాజాల ధ‌ర అమెరికాలో ఏకంగా రూ.7500 ప‌లుకుతోంది. అయితే కాజాల‌కు ఇంత క్రేజ్ స‌డెన్‌గా ఎందుకు పెరిగిందో అర్థం కావ‌డం లేదు. కాగా భార‌త మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పాయికి కాజాలు అంటే చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌న అప్ప‌ట్లోనే స్వ‌యంగా చెప్పారు. ఇక ప్ర‌స్తుత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా కాజా అంటే ఇష్ట‌మ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే దీనికి అమెరికాలో ఇంత డిమాండ్ రావ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందో తెలియ‌డం లేదు. కానీ కేజీ కాజాలు మాత్రం ఏకంగా రూ.7500 వ‌రకు ధ‌ర ప‌లుకుతున్న‌ట్లు తెలిసింది.

అయితే పూరీలోని జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో కాజాల‌ను భ‌క్తులు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తార‌ని, అందుక‌నే ప్ర‌సాదంగా భావించి కొంద‌రు కొంటున్నారు కావ‌చ్చ‌ని తెలిసింది. కానీ బీహార్ నుంచే ఎక్కువ‌గా ఈ స్వీట్‌ను అమెరికా వాసులు తెప్పించుకున్నారని స‌మాచారం. ఏపీ కాకుండా ప‌లు ఇత‌ర రాష్ట్రాల్లో కాజాలు ల‌భిస్తాయి కానీ వాటిని భిన్న ర‌కాల ప‌దార్థాల‌తో త‌యారు చేస్తారు. అందువ‌ల్ల రుచి వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా కాజాకు ఇంత‌లా డిమాండ్ పెర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news