టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌ : నిందితుడు మిస్సింగ్‌ !

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక మలుపులు తిరిగిన ఈ డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖకు ప్రధాన నిందితులు విచారణకు హాజరు కాకుండా చుక్కలు చూపిస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో ఎక్సైజ్ 12 ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా… కోర్టులు విచారణకు స్వీకరించినా… నిందితులు మాత్రం డుమ్మా కొడుతున్నారు.

ఇక ఇప్పటికే 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం కాగా…. 2020 నుంచి కోర్టుకు హాజరు కాలేదు కెల్విన్. ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులిచ్చినా కోర్టుకు హాజరు కాలేదు కెల్విన్. అటు 2018 నుంచి కోర్టుకు రాని అబూబకర్.. ముషీరాబాద్ ఎక్సైజ్ కేసులో సోహెల్ పరారీలో ఉన్నాడు. అంతేకాదు మైక్ కమింగా విదేశాలకు పారిపోయాడు. నిందితులు హాజరుకాకపోవడంతో ముందుకు డ్రగ్స్ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయినా పట్టుకోవడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్లు.. వరుసగా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.