టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ర‌వితేజ‌తో పాటు విచార‌ణ‌కు కీల‌క సూత్ర‌ధారి..!

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ విచార‌ణ కొనసాగుతోంది. కాగా ఈ రోజు విచార‌ణ‌కు ర‌వితేజ తో పాటు ఆయ‌న డ్రైవ‌ర్ శ్రీనివాస్ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. కాగా సుమారు నాలుగు గంటల పాటు రవితేజ అతని డ్రైవర్ శ్రీనివాస్ ను ఈడీ విచారిస్తోంది. మ‌రోవైపు డ్రగ్స్ కేసులో నిందితుడైన జి షాన్ అలీ ఖాన్ ను ఈరోజు ఈడి అధికారులు పిలిపించి విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ తర్వాత జిషాన్ అలీ కీలక సూత్రధారిగా ఉన్నారు.

ఎక్సైజ్ అధికారులు జీషాన్ అలీ ఖాన్ ను అరెస్ట్ చేశారు. రవితేజ విచారణ కొనసాగుతున్న సమయంలోనే జి షాన్ అలీ ఖాన్ ను పిలిపించడం పై ఆసక్తి నెల‌కొంది. జిషాన్ అలీ, రవితేజ ను కలిపి ఈడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. 2017 లో మొదటగా జిషాన్ అలీ ఖాన్ ను అరెస్టు చేయ‌గా విచార‌ణ‌లో సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాన‌ని అత‌డు వెల్ల‌డించాడు. ఇక ఇప్పుడు మరోసారి విచారించ‌డం హాట్ టాపిక్ గా మారింది.