హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించగా… బీజేపీ మరియు కాంగ్రెస్ అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. ఇక కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ పోటీ చేయనున్నారని టాక్ మొదటి నుంచి నడుస్తోంది. అయితే… తాజాగా
హుజురాబాద్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు కొండా సురేఖ.
![konda surekha is huzurabad congress candidate](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/08/New-Project-2021-08-12T163957.121.jpg)
హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ కి గట్టీ పోటీ ఇవ్వాలంటే కొండా సురేఖ కరెక్ట్ అని మాపార్టీ నేతలు పోటీచేయాలని అంటున్నారని… ఒకవేళ నేను హుజురాబాద్ లో పోటీచేసినా… మళ్లీ వరంగల్ కే వస్తానని కుండ బద్దలు కొట్టారు. అలాంటి హామీ వస్తేనే హుజూరాబాద్ లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో గట్టి నేతలను డమ్మీ చేసేందుకే మమ్ములను అప్పుడు టీఆర్ఎస్ లో చేర్చుకున్నాడని తెలిపారు. కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తే గట్టిగా మాట్లాడుతుందని ఐదేళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేశారని మండిపడ్డారు.
కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని బయటకు వచ్చామని… గత ఎన్నికల్లో పరకాలకు వెళ్లి తప్పుచేశామని తెలిపారు. కానీ ఇకపై వరంగల్ లోనే ఉంటామని క్లారిటీ ఇచ్చారు కొండా సురేఖ.