కొత్త వ్యాపారం మొదలుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు

-

సినిమా స్టార్లు కొత్త బిజినెస్‌ మొదలుపెట్టారు. ఇన్నాళ్లు సైడ్‌ ఇన్‌కమ్‌ కోసం షాప్‌ ఓపెనింగులు, యాడ్స్‌ చేసిన స్టార్లు, ఇప్పుడు సోషల్‌ మీడియాతో కూడా సంపాదిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అన్నింటిని ఇన్‌కమ్‌ సోర్సెస్‌గా మార్చుకుంటున్నారు. మిలియన్లకొద్ది ఉన్న ఫాలోవర్స్‌ని వాడుకుంటూ, లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు.

సినిమా స్టార్స్‌కి అభిమానులకి మధ్య వారధిగా ఉన్న సోషల్‌ మీడియా ఇప్పుడు బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది. ఒక్కో పోస్ట్‌ లక్షలు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా టాప్ హీరోయిన్లైతే ఈ సోషల్‌ మీడియాలో భారీ బిజినెసులు చేస్తున్నారు. చిన్న చిన్న పోస్టులతో లక్షలు సంపాదిస్తున్నారు.

సమంత చేతినిండా సంపాదిస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు యాంకరింగ్‌తో బిజీగా ఉన్న సామ్, సోషల్‌ మీడియా ప్రమోషన్స్‌తోనూ లక్షలు అందుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోన్న సమంత, రీసెంట్‌గానే యాంకర్‌గా మారింది. ‘సామ్‌జామ్’ టాక్‌షోకి సమంత ఒక్కో ఎపిసోడ్‌కి 15 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కార్పొరేట్‌ బ్రాండ్స్‌ ప్రమోట్‌ చెయ్యడానికి ఒక్కో పోస్ట్‌కి 10 నుంచి 15 లక్షల వరకు తీసుకుంటుందట సమంత. ఇక లాక్‌డౌన్‌లో అయితే భర్త, నాగచైతన్యతో కలిసి ఒక డిటర్జంట్‌ పౌడర్‌ గురించి పోస్టులు పెట్టింది.

కొత్త పెళ్లి కూతురు కాజల్‌ ఏం చేసినా చాలా డెడికేషన్‌తో చేస్తుంది. హనీమూన్‌లో కూడా యాడ్‌ ప్రమోషన్‌ని విడిచిపెట్టలేదు. సంపాదనలో ఇంత డెడికేషన్‌ చూపిస్తుంది కాబట్టే, కాజల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోన్న కాజల్, సోషల్‌ మీడియా పోస్ట్‌కి భారీగానే ఛార్జ్‌ చేస్తోంది. ఒక్కో కమర్షియల్ పోస్ట్‌కి 15 లక్షల వరకు వసూల్‌ చేస్తుందట కాజల్. రిసార్ట్ ముందు కలిసి ఫోటోలు దిగడం, అండర్‌ వాటర్‌ రూమ్‌ ఫోటోలు షేర్‌ చెయ్యడం అన్నీ అగ్రిమెంట్‌లో భాగమే అంటున్నారు జనాలు.

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ ఛైర్ కోసం పోటీ పడుతోన్న పూజా హెగ్డే కూడా సోషల్ మీడియా పోస్టులతో బాగానే సంపాదిస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ స్టార్డమ్‌ ఉన్న పూజ తమ బ్రాండ్స్‌ గురించి పోస్టులు పెడితే మార్కెట్‌కి ప్లస్‌ అవుతాయి అనుకుంటున్నారు కార్పొరేట్స్. ఈ డిమాండ్‌నే క్యాష్‌ చేసుకుంటూ, ఒక్కో పోస్ట్‌కి 10 లక్షలకు పైనే ఛార్జ్‌ చేస్తుందట పూజా హెగ్డే.

ఛబ్బీ లుక్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నా. తెలుగులో సినిమాలు తగ్గిపోయినా, తమిళ్‌ మూవీస్‌తో నెట్టుకొస్తోంది రాశీ. అయితే సినిమాలు అటూ ఇటూగా ఉన్నా బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో మాత్రం రాశీ చాలా స్పీడ్‌గా ఉంది. కొబ్బరి నూనె నుంచి మొదలుపెడితే, షాపింగ్‌మాల్ వరకు అన్ని రకాల యాడ్స్‌ చేస్తోంది రాశి. ఇక వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే రాశీ ఖన్నా 5 లక్షలకు పైనే చార్జ్‌ చేస్తుందని సమాచారం.

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ ర్యాంక్‌ పోయినా, హిందీ సినిమాలతో బిజీగా ఉంది రకుల్‌ ప్రీత్‌ సింగ్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటోన్న ఈమెకి కార్పొరేట్ వరల్డ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుతోనే సోషల్‌ మీడియాలో బ్రాండ్‌ ప్రమోషన్‌ చేస్తూ లక్షలు సంపాదిస్తోంది రకుల్. ఈమె సోషల్‌ మీడియాలో బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తే 5 నుంచి 10 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తుందని సమాచారం.

బోల్డ్‌ రోల్స్‌తో సోషల్‌ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. గ్లామర్‌ ట్రీట్‌లో ఎప్పుడూ ముందుండే పాయల్‌, సోషల్‌ మీడియాని బాగానే వాడేస్తోంది. బోల్డ్ బ్యూటీ ఇమేజ్‌తో లక్షలు అందుకుంటోంది. రగ్గులు, కాస్మొటిక్స్, నగలు ఇలా అన్నింటిని ప్రమోట్ చేస్తోంది. ఒక్కో పోస్ట్‌కి 5 లక్షల వరకు చార్జ్‌ చేస్తోందట పాయల్.

Read more RELATED
Recommended to you

Latest news