బిచ్చగాడు సినిమాను వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

-

బిచ్చగాడు సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక తమిళ్ మాతృక నుంచి వచ్చిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు కూడా కళ్ళు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయి.. ఈ సినిమా గురించి తాజాగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు వెల్లడించారు.. శ్రీకాంత్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను.. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే కొంచెం ఫీల్ అవుతాను. ఇక 100 సినిమాలు అప్పుడే చేశానా అని అనిపిస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

పెళ్లి సందడి లాంటి సినిమా మళ్లీ చేయాలి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక రాఘవేంద్రరావు అందరు హీరోలు ఇష్టపడే డైరెక్టర్, తారక రాముడు సినిమా ఫ్లాప్ అయినా ఆ పాత్ర నాకు బాగా నచ్చుతుంది అంటూ తెలిపారు. ఫ్యామిలీ సబ్జెక్టులకు బిల్డప్పులు ఎక్కువగా ఉండవని, ఫ్యామిలీని బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఇకపోతే పిల్లలను మనం రుద్దేసి సినిమాల్లోకి పంపించడం కరెక్ట్ కాదు అని వారికి నచ్చినప్పుడే వస్తారు అని కూడా తెలిపారు..ఇక మంచి పాత్రలు వస్తే విలన్ రోల్స్ లో చేయడంలో తప్పు లేదని కూడా తెలిపాడు.

బిచ్చగాడు సినిమాలో నటించే అవకాశం మొదట నాకే వచ్చింది .. తెలుగు వర్షన్ లో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమా రేటు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక తెలుగులో మదర్ సెంటిమెంట్ పెంచుదామని అనుకున్నారని, ఎక్కువ మొత్తం అడగడంతో ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను అని కూడా శ్రీకాంత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news