రేపు ఏపీ సర్కార్‌ తో సినిమా పెద్దల సమావేశం

అమరావతి : సినిమా టికెట్ల ను ఆన్‌ లైన్‌ చేస్తూ… ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో సిని పరిశ్రమ తో పాటు.. రాజకీయాల్లోనూ పెను సంచలన నెలకొంది. ఏపీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర మైన వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యం లో రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం లో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో చర్చలు జరుపనుంది జగన్‌ సర్కార్‌.

జగన్‌ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. అంతేఆదు… ఈ సమావేశంలో సినిమా నిర్మాతలు.. ప్రదర్శనకారులు మరియు పంపిణీదారులు పాల్గొననున్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమ కు ఎదురైన ఇబ్బందుల పై చర్చించనున్నారు. ఆన్లైన్ టికెట్ పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు మంత్రి పేర్ని నాని.. రేపటి సమావేశంలో ఆన్లైన్ సినిమా టికెట్ అంశం పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.