వైసీపీ నేతలే బలిసికొట్టుకుంటున్నారు..టాలీవుడ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

-

రెండు రోజుల క్రితం.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై వైసీపీ కొవ్వూరు ఎమెల్యే ప్రసన్న కూమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ ప్రముఖులు బలిసికొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే… ప్రసన్న కుమార్‌ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలకు టాలీవుడ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ నేతలే బలిసికొట్టుకుంటున్నారని ఫిలిమ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్ వీ ప్రసాద్ ఫైర్‌ అయ్యారు.

సినిమా వాళ్ళని బలసి కొట్టుకుంటూన్నారని అనడం బాధకరమని… కొవ్వూరు లో ప్రసన్న కూమార్ గురించి అడిగితే తెలుస్తుంది అతని ఎంటి అనేది అంటూ మండిపడ్డారు. వంద అడుగులు పై నుండి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటూన్నారో తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటూన్నారు.. బలిసి కొట్టుకుంటోంది మీరేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్‌ ప్రముఖులపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news