‘టామ్ అండ్ జెర్రీ’కి 80 ఏళ్లు.. 1940లో మొట్టమొదటిసారి ప్ర‌సార‌మైన వీడియో ఇదే..!

-

‘టామ్‌ అండ్ జెర్రీ’… ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం. టామ్ పిల్లి మరియు జెర్రీ ఎలుక. ప్రతి ఎపిసోడ్ లోను టామ్ జెర్రీ వెంట పడటం, జెర్రీ తెలివిగా టామ్ బారి నుండి బయట పడటం జరుగుతుంది. అందరూ టామ్ జెర్రీని తినటానికి వెంట పడుతుందని అనుకుంటారు. కానీ అలాంటిది ఏమి లేదు. దీనిలో ప్రత్యర్థి సవాలు మరియు జిమ్మిక్కులతో గెలవటానికి ప్రయత్నం ఉంటుంది. అలాగే ఇందులో ఎలుక, పిల్లి కలిసి పంచిన వినోదం అంతా ఇంతా కాదు. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు.. ఇక చిన్నారులు ఎగిరిగంతులు వేస్తారు. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి ‘టామ్‌ అండ్ జెర్రీ’ ప్రసారమైంది.

అయితే, అప్పట్లో ఇది ‘టామ్‌ అండ్ జెర్రీ’ పేరుతో కాకుండా ‘ది మిడ్‌నైట్‌ స్నాక్‌’ పేరుతో వచ్చింది. ‘పస్ గెట్స్ ది బూట్’ ఎపిసోడ్ పేరుతో మొట్టమొదటి షార్ట్‌ ఫిలిమ్ విడుదలైంది. పిల్లి పేరు జాస్పర్‌గా, ఎలుక పేరు జింక్స్‌గా అప్పట్లో రూపొందించారు. ఆ తర్వాతి ఏడాది నుంచి దీని పేరు ‘టామ్‌ అండ్ జెర్రీ’గా మారింది. చిన్నారులతో పాటు పెద్దలూ ఇష్టంగా చూసే ‘టామ్‌ అండ్ జెర్రీ’ సృష్టికర్తలు విలియం హన్నా, జోసెఫ్‌ బార్బారా. ఇలా మొత్తం 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలను రూపొందించారు. వీరికి ఏడు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి. టామ్‌ అండ్‌ జెర్రీ 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పిల్లి, ఎలుకలను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. మ‌రి ఇప్పుడు 1940లో అదే రోజు అంటే ఫిబ్ర‌వ‌రి 10 ప్ర‌సార‌మైన ఫ‌స్ట్ వీడియోపై ఓ లుక్కేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news