జ‌గ‌న్ స‌ర్కార్‌కు దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన య‌న‌మ‌ల‌..

-

టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారులను గౌరవించామని, కానీ ఇప్పుడు అలా లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ స‌ర్కార్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అసెంబ్లీ నుండి వచ్చే బిల్లులని శాసన మండలిలో పరిశీలించే అవకాశం ఉందని యనమల అన్నారు. అయితే వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోలేదని, సెలెక్ట్ కమిటీ కి మాత్రమే పంపామని యనమల మీడియా తో తెలియజేసారు. బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపితే భయమెందుకని ప్రశ్నించారు. రాజ్యసభకు ఉన్నట్లే రాష్ట్రాల్లో కూడా శాసన మండలికి అధికారులు ఉంటాయని స్పష్టం చేసారు.

అయితే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లు ఫై మాట్లాడటం తప్పా అంటూ జగన్ సర్కార్ కి దిమ్మతిరిగే ప్రశ్న విసిరారు. అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని యనమల మండిపడ్డారు. అధికారులపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అదే విధంగా, మండలి చైర్మన్ కి ప్రివిలైజ్ నోటీసులు ఇస్టమని అన్నట్లుగా తెలిసింది, అయితే ఆ అధికారం ఉంటుందా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news