టాప్ యాంకర్ ర‌వికి కార్ యాక్సిడెంట్‌..

-

యాంకర్ రవి.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. చానెల్ ఏదైనా, ప్రోగ్రాం ఏదైనా తనదైన మార్కుతో రెచ్చిపోవడం యాంకర్ రవి సొంతం. ఈ క్ర‌మంలోనే బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక మ‌రోప‌క్క ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలిస్తూనే ఉంటాడు ఈ యాంక‌ర్. తాజాగా ఈయన కార్‌కు యాక్సిడెంట్ అయింది. ఓ డిసిఎం వ్యాన్ వచ్చి తన కార్‌ను ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదంలో తనకేం కాలేదు కానీ కార్ మాత్రం డ్యామేజ్ అయిందని త‌న యూ ట్యాబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.

త‌న క‌ర్కెట్ రూట్‌లో వ‌స్తున్నా.. రాంగ్ రూట్‌లో వచ్చి అత‌డు డాష్ ఇచ్చాడ‌ని వివ‌రించాడు. అలాగే పట్టుకోడానికి చూస్తే పారిపోయాడని.. మ‌రియు అతడు దారుణంగా తాగి ఉన్నాడని చెప్పాడు రవి. అయితే అంత దారుణంగా తాగి ఉన్న డ్రైవర్ బండి నడిపితే రోడ్డు మీద ప్రాణాలు పోవా అంటూ ప్రశ్నిస్తున్నాడు రవి. అదే విధంగా, ఇంత దారుణంగా తాగి డ్రైవ్ చేయడం వల్లే రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని.. మ‌రియు త‌న‌తో పాటు త‌న డ్రైవ‌ర్ కూడా ఉన్నాడ‌ని.. అదృష్టం బాగుండి ఏం కాలేదని ర‌వి అన్నాడు. అలాగే అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసాడు యాంకర్ రవి.

Read more RELATED
Recommended to you

Latest news