పెళ్లి కొడుకు లేట్ గా వచ్చాడని… పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకొకడ్ని చేసుకుంది వెంటనే

-

సమయ పాలన అనేది చాలా ముఖ్యం… అది లేకపోతే వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు… ఆ లోపం కారణంగా జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పెళ్లి ముహూర్తానికి పెళ్లి కొడుకు రాకుండా ఆలస్యం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లి క్యాన్సిల్ చేసింది ఒక పెళ్లి కూతురు. వివరాల్లోకి వెళితే శనివారం ఉత్తరప్రదేశ్ లోని బిజ్‌నోర్ జిల్లాలోని నంగల్‌జత్ గ్రామంలో ఒక సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక పెళ్ళికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు.

అప్పటికే వాళ్లకు సామూహిక వివాహ కార్యక్రమంలో వివాహం జరిగింది. కాని సాంప్రదాయ బద్దంగా, పెద్ద ఎత్తున వారిని ఒక్కటి చెయ్యాలని భావించారు పెద్దలు. మధ్యాహ్నం రెండు గంటలకు వివాహం కావడంతో పెళ్లి మండపానికి భారీ ఊరేగింపు తో రావాలని పెళ్లి కొడుకు భావించాడు. ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఎదురు చూసిన పెళ్లి కూతురు ఆమె తరుపు బంధువులు విసిగిపోయారు. ఎప్పటికో సాయంత్రానికి వచ్చాడు. దీనితో పెళ్లి రద్దు చేసింది పెళ్లి కూతురు. వెంటనే మరుసటి రోజు… అంటే శనివారం ఉదయమే మరో వ్యక్తిని,

ఆమె వివాహం చేసుకుంది. దీనిపై పెళ్లి కొడుకు తరుపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాను ఆలస్యంగా రాలేదని తనను కొంత మంది బంధించారని పెళ్లి కొడుకు ఫిర్యాదు చేసాడు. తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు కూడా పెళ్లి కూతురు బంధువులు లాక్కున్నారని అతను ఆరోపించాడు. కట్న కానుకల విషయంలో గొడవే దీనికి కారణమని తెలిసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు రెండు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించలేకపోయినా సరే… పెళ్లి కుమార్తె ఇష్టమైన వారిని చేసుకోవచ్చని చెప్పారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరింది.

Read more RELATED
Recommended to you

Latest news