ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే….!

-

మీరు మీ డబ్బును బ్యాంకులో దాచుకోవాలి అనుకుంటున్నారా….? ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా…? మీరు డిపాజిట్ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…దీని వల్ల అధిక వడ్డీ అందించే బ్యాంకుల వివరాలు మీకు తెలుస్తాయి. అధిక వడ్డీ అందించే బ్యాంకులో డబ్బులు ఎఫ్డి చేస్తే మీకు మరింత లాభం కదా…? అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేటును అందించవు. బ్యాంక్ ప్రాతిపదికన మీ డబ్బుకు వచ్చే రాబడి కూడా వేరేగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా కలిపిస్తున్నాయి. అయితే ఎఫ్దీ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. పన్ను మినహాయింపు ప్రయోజనంతో ఎక్కువ వడ్డీ అందించే మొదట 10 బ్యాంకులు ఇవే….

 

money

ఎక్కువ వడ్డీ అందించే మొట్ట మొదటి బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.ఇది 7 శాతం వడ్డీ అందిస్తోంది. మీరు రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.2.12 లక్షలు పొందొచ్చు. అదే డీసీబీ బ్యాంక్ అయితే 6.95 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అది రూ.2.1 లక్షలు ఇస్తుంది. అదే మీరు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ‌లో ఎఫ్డీ చేస్తే 6.75 శాతం వడ్డీ పొందొచ్చు, అంటే రూ.1.5 లక్షలు పెడితే 2.09 లక్షలు వస్తాయి. అలానే ఇండస్ఇండ్ బాంక్‌లో కూడా వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. కనుక ఇక్కడ కూడా రూ.1.5 లక్షలు పెడితే 2.09 లక్షలు వస్తాయి.

అలానే ఆర్‌బీఎల్ బ్యాంక్ కూడా 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. యస్ బ్యాంక్ ఎఫ్‌డీల పై 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.1.5 లక్షలు పెడితే మీకు రూ.2 లక్షలు వస్తాయి. అదే డాయిష్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అయితే 6.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి. అలానే బంధన్ బ్యాంక్ మాత్రం ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీని ఇస్తోంది. కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా 6 శాతం వడ్డీని ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version