కేంద్ర ప్రభుత్వం అందించే టాప్-5 ప్రభుత్వ పొదుపు పథకాలు ఇవే.. పూర్తి వివరాలు చూసేయండి..!

-

కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలని తీసుకువచ్చింది ఈ పథకాలతో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. పేద మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పొదుపు పథకాలను తీసుకువచ్చింది డబ్బులుని ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు చక్కటి ప్రయోజనాలను ఈ స్కీముల ద్వారా పొందొచ్చు.

ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. ఎంతో సురక్షితమైన స్కీమ్స్ ఇవి. కేంద్ర ప్రభుత్వం అందించే టాప్ ఐదు స్కీముల గురించి వాటి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతుల కోసం మహిళల కోసం ఇలా ప్రభుత్వం చాలా రకాల స్కీం లని ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ప్రయోజనాలని పొందుతున్నారు. ఇక ప్రభుత్వం అందించే టాప్ 5 స్కీమ్స్ గురించి వాటి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ సేవింగ్స్ స్కీమ్:

నేషనల్ సేవింగ్ స్కీమ్ తో చాలామంది ప్రయోజనాలను పొందుతున్నారు ఇందులో కనీసం వెయ్యి రూపాయల నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు డబ్బులు పెట్టొచ్చు. జాయింట్ ఖాతా అయితే 15 లక్షలు వరకు పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ కి ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఏడాది తర్వాత దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది చార్జీలు ఉంటాయి ఈ పథకంలో ప్రస్తుతం 7.4% వడ్డీని కేంద్రం ఇస్తుంది.

నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్:

ఈ ఎకౌంట్ లో నాలుగు రకాల టైం డిపాజిట్ అకౌంట్స్ ఉన్నాయి ఏడాది రెండేళ్లు మూడేళ్లు నాలుగేళ్లు వెయ్యి రూపాయల నుండి ఇందులో డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ స్కీం లో డబ్బులు పెడితే 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్:

ఈ స్కీమ్ ద్వారా కూడా చాలామంది ప్రయోజనాలుని పొందుతున్నారు కనీసం వెయ్యి రూపాయల నుండి ఇందులో డిపాజిట్ చేయొచ్చు గరిష్టంగా 30 లక్షలు వరకు పెట్టొచ్చు ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది ఇంకో మూడు ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్:

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లో మీరు వెయ్యి రూపాయల నుండి డిపాజిట్ చేసుకోవచ్చు గరిష్టంగా ఎలాంటి లిమిట్ లేదు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.7 శాతం వడ్డీ వస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:

ఈ స్కీమ్ కింద 500 రూపాయల నుండి కనీసం పెట్టొచ్చు. గరిష్టంగా 1,50,000 వరకు ఈ స్కీమ్ లో పెట్టొచ్చు 15 ఏళ్ల తర్వాత మెచూరిటీ ఉంటుంది కావాలంటే ఐదు ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news