టాప్ లోడ్ లేదా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్.. రెండింటిలో ఏది మంచిది?

-

మొదటిసారి వాషింగ్ మిషన్ కొనేవాళ్లందరికి చాలా డౌట్స్ ఉంటాయి. మొదట కంపెనీని సెలెక్ట్ చేసుకోవడమే పెద్ద కన్ఫ్యూస్ అంటే..సరే మన బడ్జెట్ లో ఏదో ఒకటి చూసుకుంటాం..కానీ ఫ్రంట్ లోడింగ్, టాప్ లోడింగ్ లో ఏ టైప్ కొనాలనేది మనకు రెండో ప్రశ్న..అవును ఇంతకీ ఏది కొనాలి..అసలే మొదటిసారి వాషింగ్ మిషన్ కొంటున్నాం..ఏది అయితే బాగుంటనేది మనకు తెలియదు..తెలిసినవాళ్లను అడుగుతాం..వాళ్లు..వారేదైతే వాడుతున్నారో అదే బాగుంటుంది అంటారు..ఇదంతా ఎందుకు ఈరోజు మనం ఈ రెండింటింలో ఏది బెటర్ అనేది చూద్దాం..
washing-machine
washing-machine

క్లీన్ లాండ్రీ: వాషింగ్ మెషీన్‌లో లాండ్రీని కడగడం నీటి స్వభావం, ఉపయోగించిన డిటర్జెంట్ పొడి, ఎన్నిసార్లు తిప్పుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫ్రంట్ లోడింగ్ మెషిన్ టాప్ లోడింగ్ మెషీన్‌ల కంటే మెరుగ్గా ఫాబ్రిక్ నుండి మురికి ,మరకలను తొలగిస్తుంది. ఫ్రంట్ లోడింగ్ మెషీన్‌లోని డ్రమ్ములు మంచి శుభ్రపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి బట్టలు బాగా ఉతుకుతాయట.

వేగవంతమైన లాండ్రీ: లాండ్రీ సమయం ,టాప్ లోడింగ్ మెషీన్లు నీటితో నిండాల్సి ఉంటుంది. కాబట్టి లాండ్రీ వేగం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌లో ఒకసారి బట్టలు శుభ్రం చేయడానికి దాదాపు 60 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మిషన్లు…చాలావరకూ..30 నిమిషాల లాండ్రీ సామర్థ్యంతో వచ్చినప్పటికీ, ఇది తేలికపాటి బట్టలకు మాత్రమే సెట్ అవుతుంది.
వేగంగా ఆరబెట్టడం: ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ నుండి డ్రైయర్‌కు బట్టలు వేయడానికి ముందు బాగా నీటిని పిండుతుంది. అలాగే ఈ డ్రైయర్లలోని ఫ్యాబ్రిక్ కూడా త్వరగా ఆరిపోతుంది. కానీ, ఈ యంత్రం తిరిగేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తుంది. కానీ, టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లో బట్టలు ఆరబెట్టడానికి చాలా సమయం పడుతుంది.
అనుకూలమైన ఉపయోగం: టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు సాధారణంగా వినియోగదారుడి ఎత్తుకు సరిపోయేలా ఉపయోగిస్తారు. కానీ, ఫ్రంట్ లోడింగ్ మెషీన్‌లను ఉపయోగించడానికి మనం కాస్త వంగాల్సి ఉంటుంది.

నాయిస్‌లెస్ మోషన్:

ఫ్రంట్ లోడింగ్, టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌లలో వైబ్రేషన్‌ను తగ్గించే ఆధునిక మోడల్స్ ఉన్నాయి. ఇవి బెడ్ రూమ్ లేదా లివింగ్ రూమ్ దగ్గర ఉంచడానికి అనువైనవి. అయితే టాప్ లోడింగ్ మెషీన్ లో ఉతికితే శబ్ధం వస్తుంది
washing-machine
washing-machine

మెయింటెనెన్స్:

టాప్ లోడింగ్ మెషీన్ల కంటే ఫ్రంట్ లోడింగ్ మిషన్లను వెంటనే శుభ్రం చేయాలి. అయితే, టాప్ లోడింగ్ మెషీన్లలో నీరు దానంతటదే తగ్గిపోతుంది, ఎక్కువ నిర్వహణ అవసరం లేదు.
ఇలా దేనికి అది కొన్నింటిలో ఫ్రంట్ లోడింగ్ బాగుంటే…మరికొన్నింటిలో టాప్ లోడింగ్ బాగుంది. ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లో మరిన్ని ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అవి మరింత సమర్థవంతంగా ఉంటాయి. తక్కువ నీటిని ఉపయోగిస్తాయి. టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ బట్టలు ఉతకడం, వాటిని తీయడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే తక్కువ నిర్వహణ.

Read more RELATED
Recommended to you

Latest news