జగన్‌ సర్కార్‌ వైఫల్యాలపై : పవన్‌ కళ్యాణ్‌ సంచలన ట్వీట్‌

-

జగన్‌ సర్కార్‌ వైఫల్యాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మరో సంచలన ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని… అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావల్సిన ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే జాప్యం అవుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయి. కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయని ఆగ్రహించారు.

pawan kalyan ys jagan

కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో వింటున్నదే… ఈ ప్రాజెక్టుకు 25% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్ళడం లేదని… చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయని… ఈ రైల్వే లైను పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని… అలాగే నడికుడి – శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1351 కోట్లు, కడప – బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, రాయదుర్గం – తుముకూరు లైనుకు రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన అయినా అది కార్యరూపం దాల్చే విధంగా చేయడంలో వైసీపీ ఎంపీలు విఫలం అవుతున్నారని ఆగ్రహించారు. రైల్వే లైన్ల పూర్తికి ఆ శాఖ మంత్రి చెప్పిన సమాధానంలో అంశాలను ముఖ్యమంత్రికి వివరించి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయించాల్సిన బాధ్యత వైసీపీ ఎంపీలపై ఉందన్నారు పవన్‌ కళ్యాణ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news