చరణ్-శంకర్ సినిమాకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్..

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఎవరితో ఉంటుందా అన్న విషయమై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటన్నింటినీ పక్కన పెడుతూ సడెన్ గా తమిళ దర్శకుడు శంకర్ తో సినిమా కన్ఫర్మ్ అవడం షాకింగే. ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరేసరికి అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి పాన్ ఇండియా రేంజిలో పాపులారిటీ వస్తుంది. దేశ వ్యాప్తంగా శంకర్ సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా మరో రేంజిలో ఉంటుందని అనుకుంటున్నారు.

ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చే సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం థమన్ ఎంత ఫామ్ లో ఉన్నాడో తెలిసిందే. ఆయన చేసిన ప్రతీ ఆల్బమ్ సూపర్ అవుతూనే ఉంది. చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నా, సినిమా సినిమాకీ వేరియేషన్ చూపిస్తూ మంచి మంచి పాటల్ని అందిస్తున్నాడు. మరి ఈ వార్త నిజమే అయితే చరణ్ అభిమానులకి పండగే.