ఓటీటీలో టాప్లో ట్రెండ్ అవుతున్న ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ….

-

క్రియేటీవ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన.ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం లో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్నీ సాధించింది. చాలా రోజుల తరువాత సందీప్ కిషన్ కు హిట్ అందించిన ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది.దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఓవరాల్ గా రూ.27 కొట్లు రాబట్టింది.శివరాత్రి కానుకగా మార్చ్ 8న ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి ఆదరణ వస్తుంది.

 

కేవలం 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో నేషనల్ వైడ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ హారర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ చిత్రం . వరుస సెలవులు రావడం కూడా దీనికి ఒక కారణమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news