మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేసారు. అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రధాని మొత్తం విదేశాల్లోనే ఉంటున్నాడంటూ విమర్శలు కూడా చేసాయి. నిజానికి గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా విదేశీ ప్రయాణాలు చేయలేదేమో. 2015 నుండి తీసుకుంటే మోదీ మొత్తం 58దేశాలకి వెళ్లారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మురళీధరన్, మోదీ విదేశీ పర్యటనల ఖర్చులని బయటకి వెల్లడి చేసారు. ఇప్పటి వరకూ మోదీ 58దేశాలకి వెళ్ళారని, అందులో అమెరికా, చైనా, రష్యా దేశాలని ఐదు సార్లు పర్యటించారని తెలిపాడు.
2015 నుండి ఇప్పటి వరకూ చూసుకుంటే మొత్తం విదేశీ పర్యటన ఖర్చు 517.82కోట్లని వెలిబుచ్చాడు. చివరగా మోదీ బ్రిక్స్ సమావేశం కోసం బ్రెజిల్ వెళ్ళాడని చెప్పుకొచ్చారు. ఐతే ప్రతిపక్షాలు మాత్రం మోదీ విదేశీ పర్యటనలకి 2వేళ కోట్లకి పైగా ఖర్చు చేసారని అంటుంది. ఈ విమర్శలకి సమాధానంగా మోదీ విదేశీ పర్యటనల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయని, అమెరికాతో మైత్రి మరింత పెరిగిందని గుర్తు చేస్తున్నారు.