లోకేష్ ని తిట్టి అనవసరంగా ఇరుక్కున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ విషయంలో చేస్తున్న ఆరోపణలు కాస్త శృతి మించాయి. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దొంగబ్బాయి తన అవినీతి బురదను లోకేశ్ కు అంటించాలని చూస్తున్నాడని ఆయన విమర్శలు చేసారు. దోచుకున్న సొమ్ముతో పెట్టిన దొంగ పత్రికలో ఫైబర్ నెట్ స్కామ్ పేరుతో తప్పుడు కథనాలు రాయించారని ఆయన విమర్శించారు.

అసలు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.770 కోట్లయితే, రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం ఏ విచారణకు ఆదేశించినా రూ.2కోట్ల అవినీతిని కూడా నిరూపించలేదని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ 2015 నాటికి పూర్తయితే, అప్పుడు లోకేశ్ మంత్రిగానే లేడన్నారు పట్టాబి. భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్రప్రభుత్వం 8 రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటే, దానికి సంబంధించిన ఎంవోయూపై అధికారులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించే ఫైలుపై మాత్రమే లోకేశ్ సంతకం చేశారని గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news