121 కోట్లకు చేరిన డోసులు.. స్థిరంగా కొవిడ్ కేసులు

-

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నది. ఎక్కడికి వెళ్లాలనుకున్నా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిచేయడంతో చాలా మంది టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ డోసుల పంపిణీ 121.06కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో జనవరి 26న వ్యాక్సినే‌షన్ ప్రారంభించగా, ప్రస్తుతం 3006 కేంద్రాల్లో టీకాల పంపిణీ కొనసాగుతున్నది.

మరోవైపు దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. గడిచి 24 గంటల్లో కొత్తగా 8,318 కేసులు నమోదు కాగా, 10,967 మంది రికవరీ అయ్యారు. 465 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,07,019 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి బారిన పడి రికవరీ అయిన వారి సంఖ్య 3,39,88,797కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,67,933కు చేరుకున్నట్లు కేంద్ర వైద్య వర్గాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news