తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ : కేంద్రం

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయితీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటూ ఉండగా… రాష్ట్ర బీజేపీ మాత్రం కెసిఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని… మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ధాన్యం సేకరణ పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో యధావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని స్పష్టం చేసింది కేంద్రం.

గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధర ధాన్యం సేకరించినట్లు కీలక ప్రకటన చేసింది మోడీ సర్కార్.  ధాన్యం సేకరణ పై వచ్చిన కథనాలు… తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. కాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి పియుష్ గోయల్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో నీ బృందం నిన్న రాత్రి కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోలు పెంచాలని కోరారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిశారని… తాము మంగళవారం కలిసినప్పుడు కూడా అన్ని వివరాలు వెల్లడించాలని మంత్రుల బృందం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news