అమెరికాలో ఒకే రోజు 5 లక్షల కరోనా కేసులు.. ఇండియా రికార్డ్ బ్రేక్..

-

కరోనా కేసులుతో అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఇటీవల కాలంలో మళ్లీ కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చడంతో అమెరికా అతలాకుతలం అవుతోంది. కరోనా టెస్ట్ లు చేయించుకోవడానికి అమెరికన్ పౌరులు గంటల కొద్దీ క్యూలో నిలుచుంటున్నారు. టెస్టింగ్ సెంటర్ల వద్ద భారీ స్థాయిలో క్యూలు కనబడుతున్నాయి. తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా రికార్డ్ సృష్టించింది.

ప్రపంచంలో ఇప్పటికీ ఏదేశంలో నమోదు కాని విధంగా అమెరికాలో ఒకే రోజు 5 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో 5 లక్షల కేసులు ఒకే రోజు నమోదవ్వడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో 50 శాతానికి పైగా ఓమిక్రాన్ కేసులే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  గతంలో ఇండియాలో ఒకే రోజు 4 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియా రికార్డ్ ను అమెరికా బ్రెక్ చేసింది. అమెరికాలో దాదాపుగా ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 842,161 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news