టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం లో పాదయాత్ర పై డిమాండ్ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే పాదయాత్ర చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తేనే పార్టీ బతుకుతుందన్నారు మాజీమంత్రి గడ్డం ప్రసాద్. గతంలో వైఎస్ఆర్ చెవెళ్ల నుంచి పాదయాత్ర చేసి కాంగ్రెస్ కు అధికారం తెచ్చారని అన్నారు ప్రసాద్. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు మాజీమంత్రి కొండా సురేఖ.
జనంలోకి పాదయాత్ర రూపంలో వెళ్తే కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయన్నారు కొండా సురేఖ. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీసీసీ కానీ, సీఎల్పీ కానీ లేదా ఇద్దరు కలిసైనా పాదయాత్ర చేయాలని కోరారు భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య. ఎవరు పాదయాత్ర చేసిన భద్రాచలం నుంచి స్టార్ట్ చేయాలని కోరారు. నాలుగైదు నెలలు పాదయాత్ర చేయాలని కోరారు మల్లు రవి. మాజీమంత్రి గీతారెడ్డి సైతం పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు.