సిపిఎస్ సమావేశానికి ఉద్యోగ సంఘాలు దూరం

-

ఉద్యోగుల సిపిఎస్ అంశంపై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను మరోసారి ఆహ్వానించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో చర్చలకు అందుబాటులో ఉండాలని తెలిపింది.

సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ లను కూడా చర్చలకు ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఓపిఎస్పై చర్చిస్తేనే సమావేశానికి వస్తామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీ నెరవేర్చాలని తాము కోరుతున్నామని పేర్కొన్నారు ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.

తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంటుందని, ప్రభుత్వం ఏం చెబితే అది వింటున్నామని తమపై ఉద్యోగుల్లో ఓ భావన నెలకొంది అని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారని, మరి తమ ఉద్యోగుల మాట నమ్మాలా? లేక మంత్రుల సంఘం మాటలు నమ్మాలా? అని బొప్పరాజు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news