ఖైరతాబాద్ గణేష్ వద్దకు సొంత వాహనాల్లో రావద్దు : ట్రాఫిక్ పోలీస్

-

ఖైరతాబాద్ అంటే దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాంతో ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఇక హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ వెళ్లి గణేషుడి దర్శనం చేసుకుంటారు. దాంతో ఆ పరిసరాల్లో వినాయక చవితి వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి.

దాంతో ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈనేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 19వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నారు. ఖైరతబాద్ రోడ్డులో భారీ కేడ్లను ఏర్పాటు చేసి కేవలం భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని మెట్రో మరియు ఎంఎంటీఎస్ లో రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కార్లు మరియు బైకుల పై వచ్చిన వాళ్లకు హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలం లోనే పార్కింగ్ కు అనుమతి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news