“అన్నాత్తే” నుంచి రజినీ ఫస్ట్ లుక్ రిలీజ్

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం “అన్నాత్తే” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుండగా… సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, మీనా, ఖుష్బూ, మరియు కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే వినాయక చవితి పర్వదినం సందర్భంగా “అన్నాత్తే” సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ చాలా యంగ్ గా కనిపించాడు. అంతేకాదు తెల్ల షర్టు మరియు పంచెకట్టుతో అందరినీ అలరించారు రజినీకాంత్. ఇక ఈ పోస్టర్ విడుదల తో రజినీకాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా “అన్నాత్తే” సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news