సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సిలిండర్ పేలి దివ్యాంగురాలు సజీవ దహనం అయింది. ఈ సంఘటన ఇవాళ తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) నాగదర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి దివ్యాంగురాలు సజీవ దహనం అయింది. దివ్యాంగురాలు కంది ప్రేమల(48) ఒంటరిగా నివాసం ఉంటోంది.
అయితే.. రాత్రి వంట చేసుకునే సమయంలో మంటలు చెలరేగాయి. ఒకసారిగా మంటలు ఎగిసిపడి గ్యాస్ సిలిండర్ పేలిందని అంటున్నారు. దీంతో దివ్యాంగురాలు సజీవ దహనం అయింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.